Adluri Lakshman:హరీష్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలి : మంత్రి అడ్లూరి
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తే చర్చిద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సవాలు విసిరితే హరీష్ రావు (Harish Rao) తోక ముడిచి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు బండారాన్ని వాళ్ళ మరదలు కవిత (kavitha)నే బయటపెడుతోందన్నారు. హరీష్ రావు చర్చకు వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. హరీష్‌ను చర్చకు రమ్మంటే మాజీ ఎమ్మెల్యేలను పంపుతా అంటారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ (KCR) ను హరీష్ రావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హరీష్ రావు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, హరీష్ మాట్లాడిన మాటలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. హరీష్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మంత్రులు బందిపోటు దొంగలంటూ వ్యాఖ్యలు చేశారు. అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని హరీష్ అనుకుంటున్నారని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.







