త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన..

త్వరలోనే విశాఖ నుంచి ఆంధప్రదేశ్ పరిపాలన ప్రారంభమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. సీఆర్డీఏ కేసుతో రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు అతి త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు. విశాఖను మురికి వాడలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కైలాసగిరి-భోగాపురం మధ్య 6 వరుసల రహదారి వస్తుందని తెలిపారు. జీవీఎంసీలో 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముడసర్లోన పార్కును మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ పంచ గ్రామాల సమస్య కోర్టులో ఉందని, తీర్పు రాగానే పట్టాలిస్తామని తెలిపారు. సింహాచలం భూముల చుట్టూ ప్రహారి గోడ నిర్మిస్తామన్నారు. ఏలేరు-తాండవ రిజర్వాయర్ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.