CBI Court : సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ (Sunil Yadav) నాంపల్లిలోని సీబీఐ కోర్టు (CBI court) లో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో అనేక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నాడు. కడప జైల్లో దస్తగిరి (Dastagiri) ని డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక అవినాష్‌రెడ్డి కుట్ర కోణంపై తేల్చాలి. వివేకా కేసులో ఆరుగురు సాక్షుల మరణాలపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు? కల్లూరు గంగాధర్‌రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు? ఈ కేసులో ఇంకా అనేకమంది ప్రముఖులను విచారించాల్సిన అవసరముంది. ఈ కేసులో తప్పు చేయకపోతే దర్యాప్తు వద్దని మిగిలిన నిందితులందరూ ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? అని పేర్కొన్నాడు.






