World Telugu Conference: ఘనంగా ముగిసిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
గుంటూరులోశనివారం ప్రారంభమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు (World Telugu Conference) ఘనంగా ముగిశాయి. తొలిరోజు వేడుకలను సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ప్రారంభించారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ పూర్వ డైరెక్టర్ జస్టిస్ రఘురాం (Justice Raghuram), ఆధ్యాత్మిక యోగి విశ్వంజీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyannapatrudu), ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, తదితరులు హాజరై తెలుగు పరిరక్షణకు నడుం కట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 1,500 మంది కవులతో అమరావతికి దివ్య నీరాజనం సమర్పించారు.






