విశాఖ ఉక్కు మరో రికార్డు

వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ 1990 నవంబర్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ ప్రారంభం నుంచి నేటి వరకు 100 మిలియన్ టన్నుల మైలు రాయిని అధిగమించినట్టు యాజమాన్యం తెలిపింది. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ముడిసరు కొరత కారణంగా 2,3 బ్లాకఫర్నేస్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు కర్మాగారంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. కర్మాగారం 100 మిలియన్ టన్నుల రికార్డు సాధించడం పట్ల కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.