టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్యచౌదరి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అదనపు ఈవో పోస్టులో కొనసాగుతూ తిరుమలలోని జేఈవో బాధ్యతలు కూడా నిర్వహిస్తారని అందులో పేర్కొన్నారు. ఐఆర్‌ఎస్ అధికారి అయిన వెంకయ్య చౌదరి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చి, ఈ నెల 22న ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.