ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు… అమల్లో : టీటీడీ

శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడిరచింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన ప్రకారం ఆగస్టు, సెస్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మార్పును భక్తులు గమనించి సహకరించాలని కోరింది.