శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించి పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీరంగం రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీనివాసుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్, చినజీయర్, టీటీడీ ఈవో జే.శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి పుష్పపల్లకి సేవ వైభవంగా జరిగింది.