టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, వ్యాపారవేత్త మునికోటేశ్వరరావులు వేర్వేరుగా ప్రమాణం చేశారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం, అదనపు ఈఓ శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలు అందజేశారు. సుచిత్ర వెల్ల వెంట భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, కుటుంబ సభ్యులు ఉన్నారు. అంతా కలిసి కార్యక్రమానికి ముందు, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.