Minister Anagani:కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిదే : మంత్రి అనగాని

కల్తీ మద్యం తయారీకి ఆద్యులు వైఎస్ జగన్ (YS Jagan), వైసీపీ నేతలేనని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం నిజం కాదా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీ కంపెనీని కామెరూన్ ప్రభుత్వ మంత్రి సీజ్ చేసిన విషయం నిజం కాదా? వైఎస్ సునీల్‌రెడ్డి (YS Sunil Reddy) , వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ బినామీలు కాదా? ప్రతాప్ , కాకాణిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో జగనే చెప్పాలి. జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశాం. వారిపై కేసులు కూడా పెట్టాం. కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిదే అని తెలిపారు.