TTD: పోలీసుల విచారణకు హాజరైన భూమన కరుణాకర్‌రెడ్డి

వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) పోలీసు విచారణకు హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతిపై కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి (Bhanuprakash Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోపణలకు ఆధారాలు చూపాలని, విచారణకు హాజరుకావాలని ఎస్వీయూ పోలీసులు (Police) భూమనకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు ఆయన హాజరయ్యారు.