Chandrababu :సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ వీహెచ్ విజ్ఞప్తి … ఏదైనా జిల్లాకు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) పేరును ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఏదైనా ఒక జిల్లా (District)కు పెట్టాలని, ఆయన పేరుతో స్మృతివనం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V. Hanumantha Rao) విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వీహెచ్ అత్యంత నిజాయతీపరుడైన సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేశారు. తన విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వీహెచ్ తెలిపారు.