Somireddy: ఆయన్ను ఇలాగే వదిలేస్తే.. ఆ ఘనతా మాదే అంటారు : సోమిరెడ్డి
భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రబస్సు రాని ఊళ్లకు ఎయిర్‌బస్సు (Airbus) ఎందుకుని ఉత్తరాంధ్రను నాడు హేళన చేసిన జగన్, నేడు కనీస నైతికత లేకుండా చెబుతున్న డైలాగులు వెగటు పుట్టిస్తున్నాయన్నారు. ఆయన్ను ఇలాగే వదిలేస్తే దేశానికి స్వాతంత్య్రం తన తాతే తెచ్చాడని, పోఖ్రాన్ అణుపరీక్షలు తమ కుటుంబ ఘనతే. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వెనుక తన వ్యూహాలు కూడా ఉన్నాయని చెబుతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారి వల్లే రాజకీయ నేతలపై ప్రజలకు గౌరవం తగ్గిపోతుందని విమర్శించారు.






