Yanamala : అనర్హత వేటు పడుతుందనే భయంలోనే వారు ఇలా : యనమల
వైఎస్ జగన్ (YS Jagan) అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) మాత్రం ఆయనకు తెలియకుండా రిజిస్టర్లో సంతకాలు చేయడం ఆ పార్టీలో అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిణామాలు భవిష్యత్తులో వైసీపీలో చీలికకు దారితీయెచ్చని అభిప్రాయపడ్డారు. సమస్యలను అసెంబ్లీ (Assembly)లో ప్రస్తావించేందుకు ప్రజలు వారిని ఎన్నుకుంటే సమావేశాలను బహిష్కరించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 (4) ప్రకారం అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వారు ఇలా చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.






