ఏపీలో తైవాన్ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తైవాన్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే యాపిల్ ఫోన్స్‌ను తయారు చేస్తున్న తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, ఫాక్స్‌లింక్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్బుబడులు పెట్టగా, మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. దేశ పర్యటనలో ఉన్న 23 మంది తైవాన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (టీమా) బృందంతో ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) సభ్యులు చెన్నైలో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీ, నీటి లభ్యత, భూమి ధరలు వంటి అంశాలపై వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. వర్చువల్‌గా వారితో సమావేశమైన గౌర్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీకి రాష్ట్రం హబ్‌గా తయారయ్యిందని, ఈ రంగానికి అవసరమైన మావన వనరులను కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తైవాన్ను కోరారు.






