నాలుగు రోజుల సెలవులు.. 8 ప్రత్యేక రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్

వరుస సెలవులను దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు రాఖీ పండుగ (రక్షాబంధన్) వల్ల ప్రజలకు వరుసగా నాలుగు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నర్సాపూర్ – సికింద్రాబాద్, కాకినాడ – సికింద్రాబాద్, కాచిగూడ – తిరుపతి మధ్య ఈ ఎనిమిది రైళ్లు సేవలందిస్తాయని తెలిపింది.