Purandeshwari: భారత్ ఆర్థిక వృద్ధిలో మహిళలు కీలక భూమిక: పురందేశ్వరి

మహిళలు అభివృద్ధిని ముందుండి నడిపిస్తున్నారని బీజేపీ ఎంపీ, పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్‌పర్సన్ పురందేశ్వరి (Purandeshwari) అన్నారు. తిరుపతి (Tirupati) లో నిర్వహించిన మహిళా సాధికార కమిటీల జాతీయ సద్సులో ఆమె ప్రసంగించారు. మారుతున్న సమాజానికి ఈ సమావేశం ఓ నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు సమ న్యాయం, గౌరవ జీవితం ఇచ్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని తెలిపారు. వికసిత్ భారత్ -2047 సాధనలో మహిళలు ముందుండి నడిపించాలి. విద్య (Education) , వైద్యం, పరిపాలన, వ్యాపార రంగాల్లో రాణించాలి. వృద్ధిలో భాగం కావడం కాదు, ముందుండి నడిపించాలి. ఆశా కార్యకర్తల నుంచి ఐఏఎస్ (IAS) వరకు మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. వర్క్ ఫోర్స్ (Work force) లో వారి సంఖ్య వృద్ధి చెందుతోంది. వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు 70 కేంద్ర, 400 రాష్ట్ర పథకాలు ఉన్నాయి. ప్రస్తుత భారత్ ఆర్థిక వృద్ధిలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వారి వృద్దికి ఉపయోగపడేలా మనందరం కృషి చేయాలి. ఇక్కడే నేర్చకున్న అంశాలను మీ రాష్ట్రాల్లో అమలు చేయాలి. స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆయా అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రతి బాలిక గొప్ప కలల కనేలా, ప్రతి మహిళా వర్క్‌ఫోర్స్‌లో రాణించేలా కలిసి పనిచేద్దాం అని అన్నారు.