టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్ల భూరి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌నకు చెందిన రాజిందర్ గుప్తా రూ.21 కోట్ల భూరి విరాళాన్ని అందజేశారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేశారు. టీటీడీ చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్ని అందించినట్లు దాత తెలిపారు.