Pelican Valley IT Park: ఆంధ్రప్రదేశ్ సూళ్లూరుపేట దగ్గర ‘పెలికాన్ వాలీ’ ఐటీపార్క్

తెలుగుటైమ్స్‌తో ఫౌండర్ ప్రసాద్ కూనిశెట్టి
న్యూజెర్సిలో స్థిరపడిన ప్రసాద్ కూనిశెట్టి (Prasad Kunisetty) నాకు చిరకాల మిత్రులు. ఆయన 30 ఏళ్ళ క్రితమే కంప్యూటర్ మీద తెలుగులో ఒక పుస్తకం తెచ్చారు. అది అనేక సార్లు రీప్రింట్ కూడా చేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలలో పనిచేసి, ఒక ఐటీ ప్రొఫెషనల్‌గా అమెరికా వచ్చి స్థిరపడిన వ్యక్తి. తన ఐటీ నైపుణ్యం కోసం Effexoft అనే కంపెనీని, తనలోని జర్నలిస్ట్ కోసం తెలుగు పీపుల్.కామ్ అనే తెలుగు పోర్టల్ స్థాపించి అభివృద్ధిపదంలోకి నడిపారు. ఆయన అనేక స్టార్టప్ కంపెనీలలో ఇన్వెస్టర్ కూడా. ప్రసాద్ కూనిశెట్టి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి – చెన్నై హైవే మీద సూళ్లూరుపేట దగ్గర పెలికాన్ వాలీ అనే ఐటీ పార్క్ (Pelican Valley IT Park) నిర్మిస్తున్నారు. తెలుగు టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ, పలు వివరాలను తెలియజేశారు.
పెలికాన్ వాలీ అనే ఐటీ పార్క్ గురించి..
భారత దేశంలో ఐటీ పార్కులు అన్నీ పెద్ద నగరాల్లో నిర్మించారు. వాటి చుట్టూ నగరాలు మరింత అభివృద్ధి చెంది భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయితే అదే సమయంలో ఆ ప్రాంతాల్లో రద్దీ, కాలుష్యం విపరీతంగా పెరిగాయి. పెట్టుబడులు పెట్టేవారు అందరూ పోటీలు పడి అటువంటి ప్రాంతాలకే రావడంతో అక్కడ అన్ని రకాలుగా ధరలు పెరిగాయి. ఈ ఐటీ పార్కుల్లో ఉద్యోగులు ప్రధానంగా విదేశీ కంపెనీ లకు పనిచేస్తున్నారు కనుక వారికి ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు. కనుక వారికి ధరల పెరుగుదల వల్ల పెద్దగా ఇబ్బంది కలగడం లేదు. ఐటీ ఉద్యోగులకు జీతాలు బాగా పెరగడం వల్ల ఐటీ సర్వీసుల ధరలు బాగా పెరిగాయి. భారత దేశంలో ఉండే ఒక మధ్య స్థాయి కంపెనీ ఒక పది మంది ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలంటే ఇవాళ దాదాపు అసాధ్యం.
ఉదాహరణకు భారత దేశం అంతా కందిపప్పు సరఫరా చేసే ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. వాళ్ళు కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నా కూడా నెలకు రెండు మూడు లక్షల జీతం ఇచ్చి ఒక ఐటీ ఉద్యోగిని హైదరాబాదు నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు. దీనివల్ల ఈ కంపెనీలు నెమ్మదిగా పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాయి. ఐటీ రంగంలో బాగా పెట్టుబడి పెట్టగలిగే పెద్ద, విదేశీ కంపెనీలు కందిపప్పు అమ్మడం మొదలు పెడితే ఈ స్థానిక కంపెనీలు పోటీ పడలేవు. అలాగే దేశంలో ఉన్న ఐటీ కంపెనీలు విదేశీ కస్టమర్లు ఉంటే తప్ప తమ సంస్థలను నడపలేని పరిస్థితి ఏర్పడిరది. మరోవైపు భారతదేశంలో విపరీతమైన స్థాయిలో నిరుద్యోగం ఉంది. సరైన అవకాశాలు లేక యువత అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. నైపుణ్యం గల ఐటీ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు వస్తుంటే మరోవైపు కనీస వేతనం వచ్చే ఉద్యోగాలు లేక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అలాగని లక్షల్లో జీతాలు సంపాదించే వారు ఏమైనా సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఐటీ ఉన్న నగరాల్లో భారీ ఖర్చుల వల్ల వారికి చివరికి ఏమీ మిగలడం లేదు.
గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగాలు దొరకాలంటే..
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. ఇక్కడే ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేసి, కాలేజీ పూర్తి చేసిన విద్యార్థు లకు పెద్దగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలను కల్పించగలిగితే రకరకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. దేశంలోని స్థానిక సంస్థలకు ఐటీ సర్వీసులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడే యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ కంపెనీలకు తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగులు దొరుకుతారు.
ఈ పార్క్ ఎలా తయారవుతుంది..
పెలికాన్ వాలీ ఐటీ పార్కును ఇరవై ఎకరాల్లో ప్రారంభించి, అక్కడి నుంచి విస్తరిస్తాము. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై సూళ్ళూరుపేట, నాయుడుపేట మధ్య, వెదురుపట్టు మీదుగా శ్రీకాళహస్తి, తిరుపతి వెళ్లే రహదారి వద్ద, అంటే రెండు వైపులా రహదారి ఉన్న కీలకమైన ప్రాంతంలో ఈ ఇరవై ఎకరాల స్థలాన్ని సేకరించాము. ప్రభుత్వం దగ్గర భూమి తీసుకుంటే చాలా షరతులు ఉంటాయి. పెట్టుబడి పెట్టే వారికి పెద్దగా లాభం ఉండదు. కనుక ఈ స్థలాన్ని పూర్తిగా ప్రైవేటుగా కొనుగోలు చేశాము. దీనివల్ల పెట్టుబడిదారులకు మేము భూమిని గ్యారంటీగా ఇవ్వడానికి, లేదా కొన్ని గజాల స్థలాన్ని వారి పేరున రిజిస్టర్ చేయడానికి సాధ్యం అవుతుంది. అప్పుడు పెట్టుబడి పెట్టే వారు భయపడాల్సిన అవసరం ఉండదు, వారి పెట్టుబడి విలువ కూడా బాగా పెరుగుతుంది.
కంపెనీలు ఏ విధంగా వస్తాయి అంటే..
ప్రారంభంలో తక్కువ నైపుణ్యం అవసర మయ్యే ఉద్యోగులు కావలసిన కంపెనీలను, అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలను ఆహ్వానిస్తాము. ఇటువంటి ఉద్యోగాలను హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కల్పించడంవల్ల కంపెనీలకు ఖర్చు బాగా అవుతుంది. అదే ఇక్కడ అయితే తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రారంభంలో వచ్చే కంపెనీలకు మేము కూడా తక్కువ ధరకు లేదా ఉచితంగా ఆఫీసులను ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా సొంత సంస్థలు, మాకు వాటా ఉన్న కంపెనీల ద్వారా కొంత మందికి ఇక్కడ ఉద్యోగా లను ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రకరకాల ఐటీ రంగాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం.
హైదరాబాద్ వంటి నగరాల్లో నెలరోజుల్లో హడావిడిగా కోర్సులు చేస్తే నేర్చుకో గలిగేది పెద్దగా ఉండదు. అదే ఖర్చుతో ఇక్కడ అయితే రెండు, మూడు నెలల పాటు కోర్సు చేయ వచ్చు, ఈ కోర్సుల తరువాత వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నా ము. ఇక్కడ పనిచేసే వారికి తక్కువ జీతం వచ్చినా, ఈ ప్రాంతంలో ఖర్చు కూడా తక్కువే కనుక అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు ఇద్దరికీ బాగుంటుంది. ఆఫీసు, నివాస సముదా యాలు కూడా అన్నీ ఒక చోట ఉండడంతో ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి లేకపోతే క్వాలిటీ పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో క్వాలిటీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. స్టార్టప్ కంపెనీలను ఇక్కడికి ఆహ్వానించి, వాటిలో మా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల ద్వారా పెట్టుబడు లు పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అమెరికాలో వున్న మా సొంత కంపెనీలు కూడా అక్కడకు వస్తాయి. అది మాకు – మాతో వున్న స్టార్ట్‌అప్ కంపనీలకు కూడా ఉపయోగం.
పెలికాన్ వాలీలో ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుతూ..
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఉండే ఐటీ ఉద్యోగులు, ఎన్నారై ఐటీ ఉద్యోగులు ఇక్కడ పెట్టుబడి పెడితే వారు కూడా ఈ ఐటీ పార్కు అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముఫ్ఫై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే వారికి రెండు వందల గజాల ప్లాట్ రిజిస్టర్ చేస్తాము. ఈ ప్లాటును మేము కానీ లేదా ఇతర డెవలపర్ల ద్వారా కానీ తీసుకొని భవన నిర్మాణాలు చేపడతాము. పెట్టుబడిదారులు స్వయంగా కూడా ఐటీ పార్కు నిబంధనలకు లోబడి నిర్మాణం చేపట్టవచ్చు.
ప్రస్తుతం పార్క్ పనుల గురించి..
మొదటి, రెండవ దశల స్ధల సేకరణ పూర్తి అయింది. మా ఆర్కిటెక్టులు తిరుపతి నగరపాలక సంస్థ (తుడా) నిబంధనల ప్రకారం లే అవుట్ తయారు చేశారు. నిజానికి తుడా నిబంధనల కన్నా అధికంగా మేము ఎక్కువ స్థలాన్ని విశాల మైన రోడ్లు, పచ్చదనం కోసం, పార్కుల కోసం కేటాయించాం. మరో ఏడాదిలో భవన నిర్మాణాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నాము. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఏ పని అయినా చేస్తున్నాము. మాకు అనుగుణంగా ఉన్న వారిని మాత్రమే పెట్టుబడి పెట్టడానికి ఆహ్వానిస్తున్నాము. పెట్టుబడి పెట్టే వారికి మంచి ఫలితాలు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మరిన్ని వివరాలకు ఈ ఈమెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. contact@pelicanvalley.net