Balineni: ప్రకాశం పర్యటనలో పవన్ ప్రోత్సాహం.. బాలినేనికి ఎంఎల్సీ అవకాశంపై జోరుగా చర్చ..

ఒంగోలు (Ongole) రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) భవితవ్యంపై ఇప్పుడు రాజకీయంగా చురుకైన చర్చలు జరుగుతున్నాయి. జనసేనలోకి వచ్చిన తర్వాత బాలినేనికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది అని పలువురు చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనకు అండగా ఉంటారన్న నమ్మకంతో బాలినేని సాగిపోతున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లో కీలకంగా ఉన్న బాలినేని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్‌కు సహాయపడినట్టు పవన్ స్వయంగా చెబుతుండటం విశేషం. గత ఎన్నికల తర్వాత వైసీపీని విడిచిన బాలినేని, జనసేనలో చేరిన వెంటనే నాగబాబు (Nagababu) ,పవన్ కల్యాణ్‌ను కలిసి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీ (MLC) సీటు కావాలన్న అభిలాష ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ఆశ నెరవేర్చలేదు. దాదాపు ఎనిమిదే మాసాలుగా బాలినేని ఎదురు చూస్తుండగా, ఎటువంటి స్పష్టత రాలేదు.
అయితే ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకాశం (Prakasam) జిల్లా పర్యటనలో పాల్గొన్న సమయంలో, ఆయన చివరి క్షణాల్లో బాలినేనిపై ప్రత్యేక గౌరవం చూపించారు. ఆయనను అత్యంత సన్నిహితుడిగా అభివర్ణించడమే కాకుండా, నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడిగా పొగిడారు. అప్పటివరకు జనసేనలో బాలినేనిని వ్యతిరేకించిన కొందరికి ఇది పెద్ద షాక్‌లా మారింది. కాశీనాథ్ (Kashinath) సహా మరికొందరు నాయకులు బాలినేనిపై వ్యాఖ్యలు చేస్తూ వచ్చినప్పటికీ, పవన్ వ్యాఖ్యల తర్వాత బాలినేని కి పార్టీలో కాస్త పట్టు పెరిగిందనే చెప్పాలి.
ఈ పరిణామాలన్నీ బాలినేని శుభకాలం మొదలైనట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడటంతో పాటు, ఆయన్ని నమ్మకమైన నాయకుడిగా గుర్తించడం వల్ల, ఆయనకు త్వరలోనే కీలక పదవి వస్తుందన్న చర్చ మొదలైంది. అధికారిక ప్రకటన ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉండగా, బాలినేని ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటన బాలినేనికి మానసికంగా బలాన్నిచ్చింది. ఇప్పటి వరకు పార్టీ మారినప్పటికీ పెద్దగా చురుకుగా లేని ఆయన, ఇప్పుడు తిరిగి ఆక్టివ్ మోడ్ లోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.