Dharam: ఏపీ స్ఫూర్తితో మారిషస్ అభివృద్ధి : ధరమ్
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ఆధునిక సాంకేతిక హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) స్ఫూర్తిగా తీసుకొని మారిషస్ (Mauritius) దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ (Dharam Beer Gokul) తెలిపారు. తిరుమల ధర్మగిరిలోని వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించి మాట్లాడారు. అధ్యాపక వృత్తి నుంచి వచ్చి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని, ఆధునిక సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. మారిషస్‌లో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. అంతకుముందు తిరుమల (Tirumala) శ్రీవేంకటేశర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీభూవరాహ స్వామిని దర్శించుకొన్న ఆయనకు శ్రీవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు.






