RTC: దీపావళి సందర్భంగా వారి జీవితాల్లో వెలుగులు : మంత్రి రాంప్రసాద్

ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandapalli Ramprasad Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఆర్టీసీ (RTC) ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, ఆర్టిసన్స్‌కు పదోన్నతులు ఇచ్చినట్లు వివరించారు. పనిష్‌మెంట్లు, పెనాల్టీలు ఉన్నా, ప్రమోషన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలదరికీ దీపావళి శుభాకాంక్షలు (Happy Diwali) తెలిపారు.