ఏపీలో మరో భారీ పరిశ్రమ.. రూ.1,750 కోట్లతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోదియా మొత్వాని, సహ వ్యవస్థాపకులు రితేష్ మంత్రి కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు వారు ముఖ్యమంత్రికి తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కైనెటిక్ గ్రీన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే పుణె సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంగల ప్లాంట్‌ని ఈ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలను సీఎం జగన్‌కు వారు వివరించారు.






