టీటీడీ నూతన జేఈవోగా వెంకయ్య చౌదరి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. 2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్‌పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం వెంకయ్య చౌదరి డిప్యూటేషన్‌ను ఆమోదించింది. మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌పై వెంకయ్య చౌదరి పని చేయనున్నారు. గతంలో వెంకయ్య చౌదరి ఏపీ మినరల్ డెవలప్‌మెంట కార్పొరేటషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు. న్రపస్తుతం విజయవాడ కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్‌లో కమిషనర్‌గా వెంకయ్య చౌదరి విధులు నిర్వహిస్తున్నారు.