Devineni Uma: అమరావతిపై జగన్ విషప్రచారం : దేవినేని ఉమ
వైసీపీ అధ్యక్షుడు జగన్కు ధైర్యముంటే రాజధాని అమరావతి (Amaravati)లో పర్యటించి అభివృద్ధిని కళ్లతో చూడాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ చేశారు. టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుంభకోణాలకు, అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు మానేసి అమరావతికి రావాలన్నారు. సీడ్ యాక్సెస్ రహదారి, సచివాలయం, విట్, ఎస్ఆర్ఎం ఇలా జగన్ (Jagan) ఎక్కడికి వస్తే అక్కడకి వచ్చి అమరావతి ఎక్కడా మునగలేదని నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం పథకానికి వస్తోన్న ఆదరణ తట్టుకోలేక అసహనంతో అమరావతిపై జగన్ విషప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. ఆయన మానసిక రుగ్మత ప్రజలకు అర్థమవుతోందన్నారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ(YCP) బ్యాచ్ దుష్ప్రచారాలు మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.







