Cognizant: విశాఖకు మరో టెక్ దిగ్గజం ..భారీ పెట్టుబడితో వస్తున్న కాగ్నిజెంట్

విశాఖపట్నం (Visakhapatnam)లో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ (Cognizant) టెక్ సొల్యూషన్స్ ఆసక్తి కనబరిచింది. రూ.1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎదుట కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు నిర్ణయించారు. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడిరచింది. కాపులుప్పాడ (Kapuluppada) వద్ద 21.31 ఎకరాలు కేటాయించాలని కోరింది.