London: లండన్‌లో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) లండన్ (London) చేరుకున్నారు. వారికి అక్కడి తెలుగువారు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ 2025 సంవత్సరానికిగానూ ప్రకటించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును భువనేశ్వరి అందుకోనున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు (Golden Peacock Award) నూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై ఆమె స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.






