Chandrababu: అందుకే మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నంబర్ వన్ : సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆవకాయ్- అమరావతి సాంస్కృతిక వేడుకల్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రానున్న కాలంలో విజయవాడ (Vijayawada), గుంటూరు, మంగళగిరి (Mangalagiri) పూర్తిగా అమరావతి (Amaravati) లో కలిసిపోతాయి. ఎవరెంత బాధపడినా అమరావతి భవిష్యత్తు నగరంగా ( ఫ్యూచర్ సిటీ) మారి తీరుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపొంతంర చెందుతుంది అని అన్నారు. అమరావతి తరహా డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఇక్కడ కృష్ణానీరు ఉంది. కాలుష్యం ఉండదు. అమరావతిలో పచ్చదనాన్ని పెంచుతాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. నూతన సాంకేతిక విధానాల్ని వినియోగిస్తున్నాం అని వెల్లడిరచారు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్, సాంకేతికతను రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత ఉంది. దాన్ని ఉపయోగించుకుని ప్రయోజకులయ్యే బాధ్యత యువతదే. తెలుగుజాతిలో చొరవ, మంచితనం, నైపుణ్యం విలువలు, సామర్థ్యం ఉన్నాయి. అందుకే మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నంబర్ వన్‌గా ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ అత్యధిక తలసరి ఆదాయం తెలుగువారిదే అని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






