Chandrababu: బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యమివ్వండి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. ఢల్లీికి వచ్చిన చంద్రబాబు కృష్ణమేనన్ మార్గ్‌లోని హోం మంత్రి నివాసంలో అమిత్ షా (Amit Shah)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి (Amaravati)కి పార్లమెంట్ (Parliament) ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల రాష్ట్రంలో మరింత వేగంగా అభివృద్ధి జరగడంతోపాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్లవుతుందని విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని అడిగారు. కొత్తగా తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వాటా సమకూర్చాల్సి ఉంది. దీనిలో ఏపీకి ప్రత్యామ్నయ వెసులుబాట్లు కల్పించాలి అని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వివరించి, తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.






