Chandra Babu: బాబు vs జగన్..ఏపీలో మళ్లీ అదే రాజకీయ పోరు..

ఏపీ లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా తలపడేది చంద్రబాబు (Chandra Babu) ,జగన్ (Jagan) అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ ఇద్దరి మధ్య జరిగే పోటీనే ప్రజలు గమనిస్తారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 ఎన్నికల్లో జగన్ చేసిన పాదయాత్ర, ఆయన ప్రజల్లో ఏర్పరచుకున్న ఓ మానసిక అనుబంధం వల్లే విజయం సాధించగలిగారని చాలామంది భావించారు. అదే విధంగా 2024లో మాత్రం చంద్రబాబులోని అనుభవం, ఆయన నాయకత్వ పరిపక్వత, ప్రజల్లో నమ్మకం వంటి అంశాలు విజయానికి దోహదపడ్డాయని చెబుతున్నారు.
ఇప్పుడు ‘సూపర్ సిక్స్’ (Super six) హామీలపై జరుగుతున్న చర్చే ఈ రాజకీయ తర్కాలకు మళ్లీ ఊతమిస్తోంది. జగన్ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన ఆరు ముఖ్యమైన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తప్పితే మిగతావి అమలవ్వలేదని ఆరోపిస్తున్నారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తవ్వలేదు కాబట్టి, వాటిని అమలు చేయడానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు. అయినప్పటికీ, వైసీపీ (YCP) వర్గం మాత్రం హామీలు అమలు కాలేదని విమర్శలు చేయడం కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో పథకాల ప్రభావం వాస్తవంగా ఎంత ఉందనే దానిపై సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికల్లో చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో జగన్ అనేక సంక్షేమ పథకాల హామీ ఇచ్చినా.. ప్రజలు ఆయన పైపు మొగ్గలేదు అని చాలా మంది మేధావులు విశ్లేషిస్తున్నారు. వారు పేర్కొన్నదాని ప్రకారం, జగన్ కు 40 శాతం ప్రజల మద్దతు ఉండగా, 60 శాతానికి పైగా ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారని తేలింది. ఈ గణాంకాల ప్రకారం పథకాలు ఓటర్లపై చూపే ప్రభావం 33 శాతాన్ని మించదని అంచనా వేస్తున్నారు.
ప్రజలు ఇప్పుడు సంక్షేమ పథకాలకంటే స్వయంపరిపాలనపై ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం శక్తితో ముందుకెళ్లాలని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే చంద్రబాబు ప్రజల గౌరవాన్ని కాపాడే దిశగా నడవడమే ఆయనకు అనుకూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన అనుభవం, ప్రజల నమ్మకం కలిసొచ్చి ఎన్నికలు ఎప్పుడైనప్పటికీ ఆయనకు అనుకూల ఫలితాలనే తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఓటమి తర్వాత జగన్ తిరిగి మళ్లీ అధికార కూటమి పై పోరు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోని త్వరలో మళ్లీ అదే బాబు వర్సెస్ జగన్ తలపోరే రాజకీయ రంగస్థలంపై మళ్లీ కనిపించే అవకాశం ఉంది.