Nani-Sujeeth: నాని సుజిత్ ఎలా ఉంటుందంటే?

డైరెక్టర్ సుజిత్(Sujeeth). రన్ రాజా రన్(Run raja run) సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమైన సుజిత్, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్(prabhas) దర్శకత్వంలో సాహో(saaho) చేసి అందరినీ తన స్టైలిష్ మేకింగ్ తో మెప్పించిన సుజిత్, రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) తో చేసిన ఓజి(OG) అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాతో మరో హిట్ అందుకున్నాడు.
ఓజి తర్వాత సుజిత్, నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే నానితో సుజిత్ ఎలాంటి సినిమా చేయనున్నాడు? సుజిత్ ఈసారి ఏ జానర్ సినిమా చేయబోతున్నాడనేది తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఓజి ప్రమోషన్స్ లో భాగంగా సుజిత్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
నానితో తాను చేయబోయే సినిమా రన్ రాజా రన్ తరహా కామెడీ థ్రిల్లర్ గా ఉంటుందని, సాహో, ఓజి సినిమాలకు ఆ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని సుజిత్ స్పష్టం చేశాడు. నానిలోని కామెడీ యాంగిల్ ను వాడుకుని ఈ సారి సుజిత్ సినిమా చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. బ్లడీ రోమియో(Bloody Romeo) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. నాని ప్యారడైజ్(the Paradise) షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.