Chandrababu: దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఈనెల 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి (Abu Dhabi) , యూఏఈ(UAE) ల్లో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025)కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడిదారులతో సీఎం భేటీ అయ్యి విశాఖ (Visakhapatnam) సదస్సుకు ఆహ్వానించనున్నారు. సీఎంతోపాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.