Dussehra Carnival :గిన్నిస్ రికార్డు సృష్టించిన దసరా కార్నివాల్

మైసూర్ దసరా ఉత్సవాలకు దీటుగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదే గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. విజయదశమి (Vijayadashami) సందర్భంగా విజయవాడలోని ఇందిరగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు వేలమంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ (Dussehra Carnival) , గిన్నిస్ బుక్ (Guinness Book) లో స్థానం సంపాదించింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది. ప్రశంసా ప్రతాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు అందజేశారు. దసరా కార్నివాల్ వాక్‌లో అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
40కి పైగా కళా బృందాలు, 3 వేల మందికి పైగా కళాకారులతో మెగా కార్నివాల్ వాక్ ఆకట్టుకుంది. కార్నివాల్ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఏపీ క్రియోటివ్, కల్చరల్ కమిటీ చైర్‌పర్సన్ తేజస్వి ఒక్కో కళారూపం ప్రత్యేకతను వివరించారు. చంద్రబాబు కార్నివాల్‌ను ఆసక్తిగా వీక్షించారు. కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహ పరిచారు. కార్నివాల్ వాక్ తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయం, ఆధునికత కలగలిపిన ప్రత్యేక వేషధారణలు, ప్రదర్శనల్ని ఆసక్తిగా తిలకించారు. పర్యాటక రంగానికి స్థానిక కళలు, కళాకారులకు కార్నివాల్ కొత్త ఊపు తెచ్చింది.