Chandra Babu: ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు కొత్త ప్రొగ్రెస్ కార్డ్ విధానం..

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గతంతో పోలిస్తే ఈసారి పార్టీ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోగా టీడీపీ నియోజకవర్గాల వారీగా వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది పూర్తవుతున్న సందర్భంలో జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రెస్ కార్డుల ప్రణాళికను టీడీపీ వరకు పరిమితం చేస్తారు. కానీ భవిష్యత్తులో బీజేపీ (BJP), జనసేన (Janasena) కూడా ముందుకు వస్తే వారికీ ఇది వర్తించవచ్చని భావిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గం పనితీరును కొన్ని లక్ష్యాల ఆధారంగా అంచనా వేస్తారు. పనితీరు బాగా ఉన్న చోట్లకు ఏ+ (A+), సరసమైన స్థాయిలో ఉన్నవాటికి ఏ (A), ఇంకా మెరుగుదల అవసరమైన చోట్లకు బీ (B) గ్రేడ్ ఇవ్వనున్నారు. అభివృద్ధి, పాలన, సమన్వయం, ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇవ్వడం, ఆరోపణల నివారణ వంటి అంశాలను ఈ ప్రణాళికలో భాగంగా పరిగణనలోకి తీసుకుంటారు.
రహదారి నిర్మాణాల పనితీరు ద్వారా నియోజకవర్గ అభివృద్ధిని అంచనా వేయనున్నారు. గతంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వ పాలనలో జరిగిన లోటుపాట్లను నిర్లక్ష్యాన్ని ప్రజల్లో స్పష్టంగా వివరించి, కొత్త మార్గాలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయో చూడనున్నారు. సుపరిపాలనలో భాగంగా “తొలి అడుగు” కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఈ విషయంలో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 132 నియోజకవర్గాల్లో ఇది అమలు చేయాలని నిర్ణయించగా, కేవలం కుప్పం (Kuppam) ,, మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గాలను మినహాయించారు.
కూటమి భాగస్వామ్యాన్ని పెంపొందించడం కూడా ఒక కీలక అంశంగా తీసుకుంటున్నారు. కూటమి పార్టీలు పరస్పరం కలిసి పనిచేయడాన్ని చూసి కూడా ఆ నియోజకవర్గానికి నాయకత్వం గుర్తింపు ఇస్తుంది. దీంతో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన కౌంటర్ ఇచ్చే ఎమ్మెల్యేలను గుర్తించి కూడా మార్కులు కేటాయిస్తారు. చాలామంది ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల విషయంలో స్పందించకుండా ఉండటం సీఎం (CM) చంద్రబాబుకు అసంతృప్తిగా అనిపిస్తోంది.
ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు కూడా ఈ ప్రణాళికలో ప్రాముఖ్యత పొందబోతున్నాయి. ప్రస్తుత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భవిష్యత్తులో ఎలా ఉండాలో ఈ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా పార్టీ నాయకత్వం స్పష్టత తెచ్చే ప్రయత్నంలో ఉంది. వచ్చే మూడునెలల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన, ప్రజలతో వ్యవహారం, అభివృద్ధి పనులపై దృష్టి పెడితే, ఏడాదిన్నర తర్వాత మరింత సమగ్రంగా వారి పనితీరును విశ్లేషించడానికి వీలవుతుంది.