Jagan: క్యాడర్ ఉత్సాహానికి సభల మంత్రం..మరి జగన్ రూట్ ఏమిటో?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఉత్సాహం నింపేందుకు ప్రతీ సంవత్సరం భారీ సభలను నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఆవిర్భావ దినోత్సవాలు, రజతోత్సవాలు వంటి ప్రత్యేకమైన సందర్భాలను ఎన్నుకుని పార్టీలు తమ బలం ఏంటో ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జనసేన పార్టీ (JanaSena Party) మార్చి 14న భారీ స్థాయిలో సభ నిర్వహించి క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జనసేన ఈ కార్యక్రమంతో తమ శక్తిని మరోసారి చాటిచెప్పింది. ఇదే తరహాలో తెలంగాణాలో (Telangana) భారత రాష్ట్ర సమితి (BRS) కూడా ఏప్రిల్ 27న రజతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ సభలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao ) ప్రత్యక్షంగా పాల్గొని గులాబీ దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సభ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తల్లో తమ పార్టీపై నమ్మకం మరింత పెరిగింది.
ఇక మే నెలలో తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు (Mahanadu) నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈసారి టీడీపీ 43వ మహానాడు జరుపుకోనుంది. కడప (Kadapa) జిల్లాలో, ముఖ్యంగా పులివెందుల (Pulivendula) ప్రాంతంలో మూడు రోజులపాటు మహానాడు నిర్వహించాలని చూస్తున్నారు. దీనివల్ల టీడీపీ క్యాడర్‌లో మరింత ఉత్తేజం తేవడం ఖాయం. ఇలా ప్రతి పార్టీ తమ క్యాడర్‌ను చైతన్యం చేయడానికి ఏటా సభలు నిర్వహించడం కనిపిస్తోంది.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) మాత్రం ఈ తరహా కార్యకలాపాల నుంచి దూరంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో గుంటూరు (Guntur) లో ఒక భారీ సభను నిర్వహించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India – ECI) అభ్యంతరాల వల్ల దానిని వెనక్కు తీసుకున్నారని సమాచారం. అంతకు ముందు 2017లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పెద్ద సభ చేశారు. మొత్తంగా చూస్తే వైసీపీ చరిత్రలో ఈ రెండే పెద్ద సభలు.
సాధారణంగా పార్టీలు ప్రతి రెండేళ్లకో లేదా మూడేళ్లకో సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కార్యవర్గాల ఏర్పాటుతో కలిసి సభలు నిర్వహిస్తే క్యాడర్‌కి మంచి ఉత్సాహం వస్తుంది. కానీ వైసీపీ మాత్రం ఇలాంటి కార్యాచరణల పట్ల ఆసక్తి చూపడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. అధినాయకత్వం ఆధారంగా మాత్రమే పార్టీ నడుస్తోంది. దీనివల్ల నేతలు, కార్యకర్తల మధ్య సహజమైన అనుబంధం కొరవడుతోంది. ప్రతీ ఏడాది పార్టీ సభలు నిర్వహించి పార్టీ శక్తిని పరీక్షించుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ కూడా ఇదే మార్గంలో ముందుకు సాగితే మిగతా పార్టీలతో ధీటుగా పోటీ పడగలదని అభిప్రాయపడుతున్నారు.