Chandrababu: సాయిబాబా కుటుంబానికి పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా (Pinnamaneni Saibaba)కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరామర్శించారు. బేగంపేట భగవంతాపూర్‌లోని సాయిబాబా ఇంటికి వచ్చిన చంద్రబాబు, సాయిబాబా భార్య, కుమారులను యోగక్షేమాలను తెలుసుకున్నారు. సుమారు అర్థగంట సేపు అక్కడే గడిపి సాయిబాబా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడిగా పిన్నమనేని సాయిబాబా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గానూ పని చేశారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్రావు (Kambhampati Rammohan Rao,), బక్కని నర్సింహులు, తీగల కృష్ణారెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నర్శిరెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, కట్టా రాములు, మండూరి సాంబశివరావు, వల్లారపు శ్రీనివాస్ ఉన్నారు.






