Venkaiah Naidu: అలా ఇస్తే పని ఎందుకు చేయాలి? : వెంకయ్య నాయుడు
రైతులు వ్యాపారులుగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులో రైతునేస్తం ఫౌండేషన్ (Rythu Nestham Foundation) నిర్వహించిన దశమ వార్షికోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల (Farmers) అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో వారు ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు వేరే వృత్తుల వైపు వెళ్తే మన దేశం పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నాయని, అలా ఇస్తే పని ఎందుకు చేయాలని ప్రశ్నించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా ఇచ్చి, మిగతావన్నీ రద్దు చేస్తే రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా చేసే అప్పులతో ప్రజలపై భారం పడుతోందన్నారు.






