Visakhapatnam: భాగస్వామ్య పండుగకు విశాఖ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు పండుగకు విశాఖ (Visakhapatnam) సిద్ధమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తం గా నిర్వహిస్తున్న ఐదో పార్టనర్షిప్ సమిట్ (Partnership Summit)కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సాంకేతికత, నమ్మకం వాణిజ్యం ( టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్) నినాదంతో నిర్వహించే సదస్సుకు ఏయూ ఇంజినీరింగ్ (AU Engineering) మైదానం వేదికకానుంది. ఇక్కడ జర్మన్ (German) హ్యాంగర్లతో 8 భారీ ప్రత్యేక హాళ్లను సిద్ధం చేశారు. దేశ, విదేశాల ప్రతినిధులు సందర్శించే ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, నగరంలో కూడళ్లను, బీచ్ రోడ్లును సుందరీకరించారు. విశాఖలో రూ.42 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రముఖ హోటళ్ల లో అతిథుల కోసం 1,200 గదులతోపాటు 800 కార్లను సిద్ధం చేశారు.







