దౌత్యవివాదంలో కెనడాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై…
ఏడాదిగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న భారత్-కెనడా సంబంధాలు మరింతగా దిగజారాయి. భారతహైకమిషనర్ ను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా కెనడా నోటిఫై చేయడాన్ని తీవ్రంగా స్పందించిన భారత్.. దౌత్యపరంగా చర్యలకు దిగింది. కెనడాలోని తమ హైకమిషనర్, ఇతర దౌత్య అధికారులను వెనక్కు పిలిపిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. తమ దౌత్య అధికారులకు భద్రత కల్పించేవిషయంలో ట్రూడో సర్కార్ పై విశ్వాసం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంలో భారత్ లోని కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ కు.. విదేశాంగశాఖ సమన్లు పంపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్య అధికారులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని.. ఆ అధికారికి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో సర్కార్ మద్దతిస్తుండడంతో.. ప్రతిగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది. వేర్పాటు వాది, ఖలిస్తాన్ నేత నిజ్జర్ హత్యకేసులో భారత ప్రమేయముందని 2023లో కెనడా ప్రధాని ట్రూడో నేరుగా విమర్శలుచేశారు. దీన్ని అప్పట్లోనే భారత్ తీవ్రంగా ఖండించింది.దీనికిసంబందించిన ఆధారాలు అందజేయాలని కోరింది.
అయితే ఇంతవరకూ తమకు ఎలాంటి ఆధారాలు రాలేదని తేల్చి చెప్పింది. లేటెస్టుగా తమ హైకమిషనర్, ఇతర అధికారులను..పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా కెనడా సర్కార్…నోటిఫై చేయడంతో.. ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు.






