ఇజ్రాయెల్ కు హెజ్ బొల్లా షాక్.. ఆర్మీబేస్ పై భీకరదాడి..
గాజా, లెబనాన్ పై దాడులతో హడలెత్తిస్తున్న ఇజ్రాయెల్ కు గట్టిషాకిచ్చింది హెజ్ బొల్లా ఉగ్రవాద సంస్థ.గట్టిషాకిచ్చింది. వూహించని విధంగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకకాలంలో డ్రోన్ల దండు విరుచుకుపడడంతో .. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యమైనట్లు సమాచారం. ఈదాడుల్లో నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మృతి చెందినట్లు ఆదేశం ప్రకటించింది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ఉందని తెలిపింది. అయితే .. తొలుత ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి చనిపోయినట్లు వార్తలు వచ్చినా.. ఆవార్తల్ని ఇజ్రాయెల్ ఖండించింది.
బిన్యమిన ప్రాంతంలోని సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్ బొల్లా దళాలు దాడి చేశాయి.ఐడీఎఫ్ గొలాన్ బ్రిగేడ్ కు చెందిన సైనిక మెస్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈదాడి ప్రస్తావనను అమెరికా కామెంటరేటర్ జాక్సన్ హింక్లే ప్రస్తావించడంతో వైరల్ అయింది. కాసేపటి తర్వాత దీన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఇవి హెజ్ బొల్లా అమ్ములపొదిలోని మిర్సాద్-1రకం డ్రోన్లుగా నిపుణులు తెలిపారు.120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై గంటకు 370 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్లు దాడులు చేస్తాయన్నారు. వీటిలో 40 రకాల పేలుడు పదార్ధాలు అమర్చవచ్చు. ఇది దాదాపు 3,000 మీటర్ల ఎత్తువరకూ ఎగురగలదు.
ఇది ఇరాన్ కు చెందిన సూసైడ్ డ్రోన్ మొహజిర్ శ్రేణి-2కు చెందినది. హెజ్ బొల్లాకు చెందిన ప్రధాన డ్రోన్ ఇది. దీన్ని 2002 నుంచి హెజ్ బొల్లా వాడుతోంది. భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి డ్రోన్లను ప్రయోగించడంతో..ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయని నిపుణులు చెబుతున్నారు. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దాటుకుని వచ్చి డ్రోన్లు దాడి చేయడం ఇదే తొలిసారంటున్నారు టెల్ అవీవ్ నిపుణులు.అవి ఎలా తప్పించుకున్నాయన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.






