హమాస్ అధినేత యహ్యా సిన్వర్ హతం..
ఏడాది కాలంగా హమాస్ సంస్థపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ భారీ విజయాన్ని సాధించింది.అక్టోబర్ 7 నాటి దాడులకు మాస్టర్ మైండ్, హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ ను హతమార్చింది. ఈవిషయాన్ని ఇజ్రాయెల్ దళాలు స్వయంగా ప్రకటించాయి కూడా. ఈ విజయం సాధించిన ఇజ్రాయెల్ సైనికులకు.. ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గ్యారెంట్ సెల్యూట్ చేశారు. సిన్వర్ మృతితో గాజాలో స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు.
అక్టోబర్ 16న రపా నగరంలో మిలిటెంట్ల కదలికల నేపథ్యంలో ట్యాండర్ నుంచి ఇజ్రాయెల్ బంగాలు ఓ భవనంపై షెల్స్ ప్రయోగించాయి. దీంతో ఆ భవనం కుప్పకూలింది. సైనికులు ఆ భవనాన్ని పరిశీలించగా ముగ్గురు హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మృతుల్లో సిన్వర్ ఉన్నాడేమోనని అనుమానించిన ఐడీఎస్, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించింది. అనంతరం చనిపోయింది. హమాస్ అధినేత అని తెలియదుతో మీడియాకు వెల్లడించింది..
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లో మారణహోమానికి సిన్వర్ మాస్టర్ మైండ్ . ఈ ఘటనలో 2000 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 150 మందిని హమాస్ మిలిటెంట్లు బంధీలుగా పట్టుకున్నారు. ఈఘటనతో యుద్ధం ప్రారంభమైందని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. దాడులకు ఆదేశించారు. హమాస్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ దళాలు.. మాస్టర్ మైండ్ సిన్వర్ కోసం తీవ్రమైన వేట సాగించాయి. ఎట్టకేలకు హమాన్ అగ్రనేతను. హతమార్చాయి. అక్టోబర్ 7 నాటి ఘటన అనంతరం తన ఉనికి తెలియకుండా యహ్యా బంకర్లలో, సొరంగాల్లో తలదాచుకుంటున్నారు.
మరోవైపు.. సిన్వర్ తన చుట్టూ ఎప్పుడూ రక్షణకోసం ఇజ్రాయెలీలను బంధీలుగా ఉంచుకుంటారని సమాచారం. అయితే బాంబు దాడి జరిగిన సమయంలో మిలిటెంట్లు ఉన్న భవనంలో బందీలు లేరు.మరోవైపు గత కొద్దిరోజులుగా సిన్వర్ కదలికలపై ఇజ్రాయెల్ కు సమాచారం అందడం లేదు. ప్రాణాలతోనే ఉన్నాడా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు హతమార్చడంలో విజయం సాధించింది.






