అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా భారతదేశ అల్లుడు జేడీ వ్యాన్స్…
జులై 15న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన రన్నింగ్ మేట్‌గా ఒహియోకు చెందిన సెనెటర్ జెడి వాన్స్‌ను ఎంచుకోవడంతో ఒక్కసారిగా ఉష వాన్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జేడీ వ్యాన్స్ గెలవాలని భారతీయులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే.. వ్యాన్స్ ఇప్పుడు భారతీయ అల్లుడు మరి. దీంతో ఈసారి భారతీయుల ఓట్లు రిపబ్లికన్లకు పడే అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పవచ్చు.
ఉషా చిలుకూరి వాన్స్ ఎవరు?
ఉషా చిలుకూరి వాన్స్, ఒక ప్రొపెషనల్ లాయర్. ఆమె ముంగెర్, టోల్లెస్ & ఓల్సన్ LLP లో అసోసియేట్‌గా పనిచేశారు.వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకిదిగడంతో ఆమె కంపెనీలో జాబ్ నుంచి రిలీవయ్యారు. ఉషా ఒక అద్భుతమైన న్యాయవాది మరియు సహోద్యోగి, కొన్నేళ్లుగా ఆమె అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు..ఆమె కెరీర్లో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాము’’ అని ముంగెర్, టోల్లెస్ & ఓల్సన్ ఒక ప్రకటనలో తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కొరకు యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ఉష విస్తృతంగా సేవలందించారు. ఆమె టాఫ్ట్ స్టెటినియస్ అండ్ హోలిస్టర్ ఎల్ఎల్పిలో సమ్మర్ అసోసియేట్‌గా కూడా పనిచేశారు.
విద్యా నేపథ్యం
శాన్ డియాగో శివారులో పెరిగిన ఉష మౌంట్ కార్మెల్ హైస్కూల్లో చదివారు .తర్వాత 2007లో యేల్ యూనివర్శిటీ చరిత్రలో BA పట్టభద్రురాలయ్యారు ఉష. ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తన చదువు కొనసాగించారు, 2009లో గేట్స్ కేంబ్రిడ్జ్ డాడ్గా ఎంఫిల్ సంపాదించారు.2021లో జేడీ వ్యాన్స్ చేసిన స్పీచ్.. యూనివర్సిటీస్ శత్రువులు అన్న కాన్సెప్ట్ తరచుగా విమర్శలకు గురవుతూ వస్తోంది.దీన్ని సెనెట్ కు ప్రచారం చేస్తున్నట్లు ఆమె సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగారు. విద్యా విషయాల్లో ఉష అపారమైన జ్ఞానం, అనుభవం కలిగిన వ్యక్తి.
పెళ్లి, జీవితం..
ఉష మరియు జేడీ వాన్స్ ఇద్దరూ యేల్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్ధులుగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. 2014 నుండి వివాహం చేసుకున్న వారు తమ ముగ్గురు పిల్లలతో సిన్సినాటిలో ఉంటున్నారు. వారి మొదటి కుమారుడు, ఇవాన్ బ్లెయిన్, 2017లో మరియు వారి మూడవ బిడ్డ డిసెంబర్ 2021లో పుట్టారు. ఫాక్స్ & ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో, ఉష దంపతులు.. తమ భిన్నమైన విశ్వాసాలు మరియు అతని రాజకీయ జీవితానికి ఆమె అందించిన మద్దతును ప్రస్తావించారు. హిందూ కుటుంబంలో పెరిగిన ఉష, తన మతపరమైన పెంపకం యొక్క ప్రాముఖ్యత మరియు జెడికి తన మద్దతుపై దాని ప్రభావం గురించి వ్యాఖ్యానించారు.
‘‘కొన్ని విభిన్న కారణాలు ఉన్నాయి… ఒకటి నేను మతపరమైన కుటుంబంలో పెరిగాను. నా తల్లితండ్రులు హిందువులు, వారి పెంపకంలో తాను ఓ చక్కని సిటిజన్ గా పెరిగానన్నారు ఉష. వాన్స్ తరచుగా ఉష యొక్క మద్దతు తన విజయానికి కీలకమైనదని పేర్కొన్నారు. 2020లో ది మెగిన్ కెల్లీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, ‘‘‘అలా చేయవద్దు, అలా చేయవద్దు’ అంటూ ఉష తనకు పలు విషయాల్లో మార్గ నిర్దేశనం చేయడం వల్ల తాను అనుకున్న రంగంలో ముందుకు వెళ్లడంతో పాటు కీలక విజయాలు సాధించానన్నారు వాన్స్.
జేడీ వాన్స్ ప్రస్థానం…
మిస్టర్ వాన్స్, 39 ఏళ్ల రిపబ్లికన్, ఇప్పుడు సెనేట్‌లో తన మొదటి టర్మ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒహియోలోని మిడిల్‌టౌన్‌లో పెరిగారు. అతను మెరైన్స్లో చేరారు. మరియు ఇరాక్‌లో పనిచేశారు. తరువాత ఒహియో స్టేట్ యూనివర్శిటీ మరియు యేల్ లా స్కూల్ నుండి డిగ్రీలు పొందారు.. అతను సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా కూడా పనిచేశారు. ఒకప్పుడు ట్రంప్‌ను ‘‘ప్రమాదకరమైన వ్యక్తి అని లేబుల్ వేసిన జేడీ వాన్స్… తర్వాతి కాలంలో తన రాజకీయ ప్రయాణంలో పరివర్తన సాధించారు. ట్రంప్‌ను విజయవంతమైన అధ్యక్షుడిగా అభివర్ణించిన వాన్స్, ఎన్నికల తర్వాత క్యాపిటల్ హిల్‌లో ట్రంప్‌కు బలమైన మిత్రులలో ఒకరిగా మారారు.
ఉష జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సెనెటర్ జేడీ వాన్స్ ఎంపికైన నాటి నుంచి ఆయన భార్య ఉష చిలుకూరి పేరు అమెరికాలోనే కాకుండా భారత్‌లో కూడా మారుమోగిపోతోంది. ఏపీ మూలాలున్న ఉష గురించి మరింత తెలుసుకునేందుకు భారతీయులు, తెలుగు ప్రజలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.
ఉష వంశ వృక్షం ఇదీ..
ఉష చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచు. ఆమె మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటోంది. ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా మారి ఉష వరకూ విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లు, ఆయనకు రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ మూర్తి అని ఐదుగురు సంతానం, అందరూ ఉన్నత విద్యావంతులే. వీరిలో రామశాస్త్రి ఎప్పుడో మద్రాసు వెళ్లిపోయారు. ఐఐటీ మద్రాసులో ఆయన ప్రొఫెసర్. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి. వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ.. ముగ్గురు కుమారులు. శారద కుమార్తె. ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా.. శారద చెన్నైలో ఉంటున్నారు. రాధాకృష్ణ ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చేశారు. శాన్‌డియేగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ఉష. సాయిపురానికి చెందిన రామ్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ ఉష తాత రామశాస్త్రి చిన్న సోదరుడు గోపాలకృష్ణ శాస్త్రి, తాను తోడళ్లుళ్లం అవుతామని, ఒక ఇంటి ఆడపడుచులనే వివాహాలు చేసుకున్నామని వివరించారు. ఇటీవలే తమ వంశవృక్షం రూపొందించినట్టు తెలిపారు.
ఉషకు విశాఖపట్నంలో ఇప్పటికీ బంధువులు ఉన్నారు. తొమ్మిది పదుల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలి వరసు అవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్‌గా పని చేసిన ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ శాస్త్రి సంతానమే ఉష. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో తమకు ఆమెతో పరిచయం తక్కువేనని శాంతమ్మ తెలిపారు. వాన్స్ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారన్నారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద.. తాము వాన్స్- ఉషల వివాహానికి హాజరైనట్టు గుర్తు చేసుకున్నారు. ‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’’ అని శాంతమ్మ అన్నారు.






