వలసలపై నియంత్రణ కత్తి.. ఎన్నికల వేళ ట్రూడో సర్కార్ కఠిన నిర్ణయం..
ఎన్నికలంటే ఎక్కడైనా ఎన్నికలే. పార్టీల భవితవ్యాలు, అధినేతల తలరాతలు మార్చే కఠిన పరీక్షలు. వాటిలో నెగ్గేందుకు, పదవి దక్కించుకునేందుకు పార్టీలు,నేతలు ఎంతకైనా తెగిస్తారు. ఇందులో భాగంగా కెనడా ప్రధాని ట్రూడో… భారత్ పై విషం కక్కుతూ వస్తున్నారు. అయితే.. ఇది అంతగా సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే యువతను ఆకట్టుకునేందుకు .. కీలక నిర్ణయం ప్రకటించారు ట్రూడో. వచ్చే ఏడాది కెనడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రవేశించే వలసదారుల సంఖ్యను భారీ తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వలసల నియంత్రణకు కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. తమ దేశంలోని అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ట్రూడో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2004లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా కెనడా ప్రభుత్వం గుర్తించింది.
అయితే 2025లో ఈ సంఖ్యను 3,80,000లకు తగ్గించింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనుాన్నాయి. ఈ క్రమంలోనే చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేత్రుత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతోపాటు దేశీయంగా ఇళ్ల కొరత కూడా విపరీతంగా ఉంది. దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ఈమధ్యే విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు తీసుకురానున్నట్లు తెలిపింది. తాజాగా వలసదారుల సంఖ్యను మరింత తగ్గించేందుకు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.






