ASBL NSL Infratech

బేతంచర్లలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

బేతంచర్లలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

బేతంచర్ల బస్టాండ్ వద్ద అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగం
వైయస్ జగన్ కు నాగలి బహూకరించిన అభిమానులు

ఇక్కడకు వచ్చి నిలుచోవాల్సిన అవసరం ఏ ఒక్కరికీ లేకపోయినా ఆప్యాయతలు చూపిస్తున్నారని అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి పేరుపేరునా వైయస్ జగన్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. చంద్రబాబు పాలన నాలుగు సంవత్సరాలు అవుతోందన్నారు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయని బాబు కార్యకర్తలతో రెండు మూడుసార్లు చెప్పారన్నారు. నాలుగేళ్ల బాబు పాలన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను. మనకు ఎలాంటి నాయకుడు కావాలి. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. మీరంతా సినిమాకు వెళ్తారు. సినిమాలో అబద్ధాలు చెప్పే, మోసాలు, వెన్నుపోటు పొడిచే విలన్ నచ్చుతాడా? లేకపోతే 14 రీళ్ల సినిమాలో 13 రీళ్ల వరకు హీరో అనే వ్యక్తి ఇబ్బంది పడతాడు. న్యాయంగా, నిజాయితీగా ఉంటాడు. ఇలాంటి హీరో నచ్చుతాడా అని ప్రజల్ని శ్రీ జగన్ ప్రశ్నించారు.

14 రీళ్ల సినిమా తీసుకున్నా, రామాయణం, మహాభారతం, ఖురాన్ తీసుకున్నా ఏది తీసుకున్నా చివరకు నిజాయితీగా ఉన్న వ్యక్తే న్యాయంగా ఉన్న వ్యక్తే గెలుస్తారని శ్రీ జగన్ తెలిపారు. 13 రీళ్లవరకు హీరో దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. కానీ, 14వ రీల్ వచ్చేసరికి దేవుడు దీవిస్తాడు.. ప్రజలంతా అండగా నిలబడారు. హీరో విలన్ ను పుట్ బాల్ ఆడుకుంటాడని శ్రీ జగన్ తెలిపారు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్రజానీకం ఇబ్బందులు పడ్డారని శ్రీ జగన్ తెలిపారు. ఎన్నికల్లో గెలవటం కోసం, ప్రజల చేత ఓట్ల వేయించుకోవటం కోసం బాబు చేసిన వాగ్ధానాలను గుర్తు చేసుకోమని ప్రజల్ని కోరారు. ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు మైకు పుచ్చుకొని ఏం మాట్లాడారని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం ఎన్నికలప్పడు ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తానని బాబు హామీ ఇచ్చారన్నారు. మరి, ఈ నాలుగేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. 

నాన్నగారి హయాంలో డోన్ లో 30,500 ఇళ్ల నిర్మాణం.. 

నాన్నగారి హయాంలో డోన్ నియోజకవర్గంలో 30,500 ఇళ్లు కడితే.. బాబు గారి పాలనలో ఇళ్ల నిర్మాణం దారుణంగా ఉందన్నారు. బాబు ముఖ్యమంత్రి కాకముందు రేషన్ షాపుకు వెళ్తే.. చక్కెర, పామాయిల్, కందిపప్పు, చింతపండు, కిరోసిన్ ఇచ్చేవాళ్లన్నారు. ఇవాళ రేషన్ షాపుకు వెళ్తే బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదని శ్రీ జగన్ తెలిపారు. 

కరెంటు బిల్లు ఎంత వచ్చేది?

నాలుగు సంవత్సరాల కన్నా ముందు కరెంటు బిల్లు ఎంత వస్తోందని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఇవాళ మీ కరెంటు బిల్లు వస్తోందని ప్రశ్నిస్తే.. వెయ్యికి పైనే అని ప్రజానీకం నుంచి సమాధానం వచ్చింది. ఎన్నికల ముందు కరెంటు బిల్లు కూడా ఒక్క రూపాయి కూడా పెంచమని బాబు చెప్పిన విషయం గుర్తు చేశారు. ఇంత దారుణంగా చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. 

ఇంటింటికీ 90వేలు బాకీ పడ్డ బాబు

నాలుగు సంవత్సరాల క్రితం చంద్రబాబు జాబు రావాలంటే.. బాబు రావాలని హామీ ఇచ్చారని మరి జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండువేలు నెలనెలా ఇస్తానని చెప్పిన సంగతి శ్రీ జగన్ గుర్తు చేశారు. ఇప్పటికి బాబు వచ్చి 45 నెలలు అయిందని, అంటే ప్రతి ఇంటికీ 90వేలు బాకీ పడ్డారని శ్రీ జగన్ తెలిపారు.

రైతు రుణమాఫీ, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. బాబు రుణమాఫీ ద్వారా ఇచ్చిన డబ్బు వడ్డీకైనా సరిపోయిందా.. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా.. అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఆడవాళ్లను మోసం చేయాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇక్కడున్న చాలా మంది ఆ అక్కచెల్లెమ్మల అన్నదమ్ములు, బంధువులు ఉన్నారన్నారు. మరి, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యాయా .. అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఇన్ని అబద్ధాలు, దారుణాలు, మోసాలు చేస్తున్న వ్యక్తిని మళ్లీ ఎన్నుకునే అవకాశం ఇస్తామా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఈ రాజకీయ వ్యవస్థ మారకపోతే రాజకీయ నాయకుల్ని ప్రజలు అవహేళన చేస్తారని శ్రీ జగన్ అన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో  చైతన్యం రావాలన్నారు. ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే రేపు ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికీ కేజీ బంగారం.. ప్రతి ఇంటికీ మారుతి కారు కొనిస్తామని మభ్యపెడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డోన్ ప్రాంతమే తీసుకుంటే.. ఈ నియోజకవర్గ పరిస్థితి ఒక్కసారి గమనిస్తే ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈ ప్రాంతంలో నాపరాయి పాలిషింగ్ యూనిట్లకు కరెంటు ఛార్జీలను చంద్రబాబు భారీగా పెంచారన్నారు. వైయస్ఆర్ హయాంలో రూ.4.80పైల నుంచి రూ.3.75లకు తగ్గిస్తే బాబు రూ.8.70పైసలకు పెంచారన్నారు. మరి, దీంతో ఏ రకంగా ఉద్యోగాలు ఉంటాయి. పరిశ్రమలు నడిపేవారు ఎలా బ్రతుకుతారని శ్రీ జగన్ ప్రశ్నించారు. బాబు ముఖ్యమంత్రి కాగానే సీవరేజి ఛార్జీలు స్వ్కేర్ మీటరుకు ఇంతకుముందు రూ.18లు ఉంటే బాబు ముఖ్యమంత్రి అవ్వగానే రూ.55 చేశారన్నారు. ఇంతకుముందు 5 టన్నుల ట్రాక్టర్ రూ.200 రాయల్టీ కడుతుంటే.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో రూ.1000 కట్టాల్సి వస్తోందన్నారు. ఆ పాలిషింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో 500-600 పైగా ఉన్నాయన్నారు. వాటిల్లో సగానికి పైగా మూసేసుకుపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకొని యూనిట్ పెట్టుకుంటే దాన్ని నడుపుకోలేక మూసేసే పరిస్థితి వచ్చిందని శ్రీ జగన్ తెలిపారు. ఈ ప్రాంతంలో రూ.20వేల మందికి పైగా దీనిపైనే ఆధారపడ్డారన్నారు. ఈయన్ని చూసి సింగపూర్, జపాన్ నుంచి పరిశ్రమలు వస్తున్నాయని గొప్పులు చెప్పుకుంటున్నారు. కొత్తవి కాదు.. ఉన్నవి కూడా మూతపడుతున్నాయని శ్రీ జగన్ తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా సాగు లేదన్నారు. నీళ్లు తాగాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. దివంగత నేత పాలనలో డోన్ టౌన్ కోసం 100 కోట్లు ఖర్చు చేసి గాజులదిన్నె నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చారన్న సంగతి శ్రీ జగన్ గుర్తు చేశారు. కేఈ క్రిష్ణమూర్తి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అవుకు నుంచి నీళ్లు ఇప్పిస్తానని చెప్పారు. అంతపెద్ద మనిషి చెప్పిన మాట కూడా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తాగటానికి, సాగు చేయటానికి నీళ్లే లేవన్నారు. నీళ్లు నింపటానికి హంద్రీనీవా తీసుకురావాలని ఏ ఒక్కటీడీపీ నేతకు లేదన్నారు. చాలా మంది రైతన్నలు కలిశానని శ్రీ జగన్ తెలిపారు. గత రెండేళ్ల నుంచి రైతులకు ఉల్లి ధర గిట్టుబాటు ధర రావటం లేదని చెప్పారన్నారు. రెండు సంవత్సరాల నుంచి క్వింటాలుకు రూ.5ల కంటే ఎక్కువ రావటం లేదని పండిన పంటను చేలల్లో వదిలేస్తున్నారని శ్రీ జగన్ తెలిపారు. టమోటాలు పండే చోట కోల్డ్ స్టోరేజీ లేదంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో తెలుస్తోందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. శనగ, మినుము, మిర్చి, కంది .. ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధరలు ఉండటం లేదన్నారు.

రైతుల దగ్గర నుంచి హెరిటేజ్ సంస్థ కొన్నాక మిగిలిన వారు రంగ ప్రవేశం చేస్తారన్నారు. చంద్రబాబు కూడా దళారీయే అని శ్రీ జగన్ అన్నారు. ఎందుకు అంటే ఆయనకు కూడా షాపు ఉందన్నారు. బాబు హయాంలో గత నాలుగేళ్ల నుంచి ఇదే తంతు జరుగుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి జరుగుతోందన్నారు. బేతంచర్లలో 80వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ఉన్నది చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్. ఆరోగ్య శ్రీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గతంలో చూస్తే 108 ఫోన్ కొడితే కుయ్.. కుయ్.. అంటూ 20 నిమిషాల్లో బాగులేని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చేవారన్నారు. అవసరమైతే హైదరాబాద్ కు కూడా తీసుకువెళ్లేవారన్నారు. కుయ్.. కుయ్ అంటూ రావల్సిన అంబులెన్స్ .. ప్రజలు కావ్.. కావ్ అన్నా రావటం లేదన్నారు. ఫోన్ చేస్తే డీజిల్ లేదంటారు. టైర్లు బాగోలేదంటారు.. సిబ్బందికి జీతాలు రావటం లేదంటారు. హైదరాబాద్ పోయి వైద్యం చేయించుకోవాలంటే చంద్రబాబు డబ్బులు ఇవ్వడంట. విడిపోయిన రాష్ట్రంలో మంచి ఆసుపత్రులు ఎక్కడున్నాయని శ్రీ జగన్ ప్రశ్నించారు. గుండె జబ్బులు, న్యూరో, క్యాన్సర్ జబ్బులకు సంబంధించి ఆసుపత్రులు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని శ్రీ జగన్ అన్నారు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు అన్నా భయమే అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ జగన్ మాట్లాడుతూ.. డోన్ లో  మైనింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారని కానీ చేతల్లో ఏమీ చేయలేదన్నారు. ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకోమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారని శ్రీ జగన్ తెలిపారు. ఇక్కడకు హంద్రీనీవా నుంచి సాగు నీరు తీసుకువస్తామన్నారు. పాలిషింగ్ యూనిట్లు పెట్టుకున్న చిన్నచిన్న వ్యాపారస్తులకు చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం వస్తుందన్నారు. మనందరి ప్రభుత్వంలో పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన రాయల్టీ తగ్గిస్తామన్నారు. అంతేకాకుండా ఇక్కడున్న రాయిని ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుతామన్నారు. చదువుకుంటున్న పిల్లలకు అండగా ఉంటామన్నారు. 

నవరత్నాల గురించి జగన్ మాట్లాడుతూ.. 

అక్కచెల్లెమ్మలు పిల్లల్ని తీసుకొని పనులకు వస్తున్నారని వారందరికీ అండగా నిలిచేందుకు అమ్మఒడి పథకం తెచ్చామన్నారు. పేదరికం గురించి ప్రతి కుటుంబం బయటపడాలంటే పిల్లల్ని చదువుకున్నప్పుడే అని శ్రీ జగన్ తెలిపారు. మీ పిల్లల్ని బడులకు పంపిస్తే ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామన్నారు. వారికి రూ.15వేలు ఇవ్వటానికి కారణం ఆ పిల్లలు చదవటం కోసమే అన్నారు. ఆపిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాకపోతే ఆ కుటుంబంలో ఎప్పటికీ మార్పు రాదన్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు చదివే పిల్లల పరిస్థితి ఒక్కసారి చూడమని శ్రీ జగన్ కోరారు. ఇంజనీరింగ్ చదవాలంటే ఏడాదికి లక్ష రూపాయలు ఫీజు ఉందన్నారు. మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు నేను చేస్తానని నిన్న చెప్పానని అన్నారు. ఇంజనీర్లు, డాక్టర్ అయ్యేందుకు అయ్యే ప్రతి పైసా తను భరిస్తానని శ్రీ జగన్ మరోసారి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులకు అయ్యే ఖర్చులకు, మెస్ ఛార్జీల కింద 20వేలు ఇస్తామని శ్రీ జగన్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి చదువుల విషయంలో చేస్తున్నామని శ్రీ జగన్ తెలిపారు.

ఆరోగ్యంపై.. 

ఇవాళ ఎవరికైనా గుండెపోటు, క్యాన్సర్, చిన్నపిల్లలకు మూగ, చెవిటి ఆపరేషన్లు చేయాలంటే 6-7 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. గుండెపోటు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. కిడ్నీ వ్యాధులకు డయాలసిస్ చేయాల్సి వస్తే భారీ ఖర్చు అవుతుందన్నారు. దేవుడి ఆశీర్వాదం వల్ల మన ప్రభుత్వం వస్తే ఆరోగ్యశ్రీని సమూలంగా మారుస్తామన్నారు. 108 ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా చేస్తామన్నారు. ఎటువంటి ఆపరేషన్ అయినా.. క్యాన్సర్, కిడ్నీ రీప్లేస్ మెంట్ ఆపరేషన్ .. అవ్వాతాలకు మోకాలి రీప్లేస్ మెంట్ ఆపరేషన్ అయినా.. ఉచితంగా చేయిస్తానని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. రెండు మూడు నెలలు ఇంటి వద్ద ఉండే వారికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తామన్నారు. ఇవాళ డయాలసిస్ చేయాలంటే ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డయాలసిస్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వెళ్తే సంవత్సరం తర్వాత రమ్మని చెబుతున్నారని అన్నారు. కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వంటి నగరాల్లో వైద్యం అందిస్తామన్నారు. 104కు ఫోన్ చేస్తే రయ్ మని రావాలన్నారు. పెద్దలకు, అవ్వాతాతలకు మందులు ఇవ్వాలన్నారు. ఇవన్నీ కూడా దేవుడి దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇవాళ ఆరోగ్యం గురించి మాట్లాడాను.

ప్రతి అంశం మీద మీ సలహాలు, సూచనలు ఇవ్వండన్నారు. తోడుగా వింటాను. మీ సమస్యలు ఆలోచనలు ఇస్తే మన పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టో తీసుకువస్తాను. చంద్రబాబులా పుస్తకం తీసుకురాము.  చంద్రబాబులా మానిఫెస్టోలా కట్టకట్టలు ఉండవని శ్రీ జగన్ తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో కనిపిస్తే  చంద్రబాబును కొడతారని శ్రీ జగన్ అన్నారు. బాబులా కులాన్ని మోసం చేయమన్నారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలని పేజీలకు పేజీలు పెట్టమన్నారు. మన మేనిఫెస్టో రెండు మూడు పేజీలు ఉంటాయన్నారు. ప్రజలు దిద్దిన మేనిఫెస్టో తీసుకువస్తామని శ్రీ జగన్ ప్రకటించారు. కేవలం రెండు మూడు పేజీలు మాత్రమే ఉంటుంది. వాల్మీకి సోదరులు కనిపించి ఎస్సీల్లో చేరుస్తారని చెప్పారని వారు చెప్పారు.  ఆ మేనిఫెస్టోతో 2018-19లో ఎన్నికలకు పోతామన్నారు. 2024 వచ్చేసరికి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్నీ చేసి చూపించటమే కాకుండా.. చెప్పనవీ చేసి చూపిస్తామన్నారు. మేనిఫెస్టోలో ప్రతి అంశమూ చేశానని నన్ను ఆశీర్వదించమని మీముందుకు వస్తానని శ్రీ జగన్ అన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే అర్థం తేవటానికి తోడుగా మీ బిడ్డను ఆశీర్వదించమని మీ అందరి ఆప్యాయతలకు పేరుపేరునా చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటానని జగన్ అన్నారు.

Click here for Photo Gallery

 

Tags :