ASBL NSL Infratech

తానా కార్యదర్శి ఎవరో?

తానా కార్యదర్శి ఎవరో?

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల పర్వం ముగిసిందని, అందిన సమాచారం మేరకు కార్యదర్శి పదవులకు ఇద్దరు పోటీపడుతున్నారని చెబుతున్నారు. అంజయ్య, నరేన్‌ కొడాలి ప్యానల్‌ తరపున ప్రస్తుతం కమ్యూనిటీ సర్వీసెస్‌ కార్యదర్శిగా ఉన్న రాజా కసుకుర్తి, నిరంజన్‌ ప్యానల్‌ తరపున ప్రస్తుతం ట్రెజరర్‌గా ఉన్న అశోక్‌బాబు కొల్లా పోటీ చేస్తున్నట్లు సమాచారం.

తానాలో మరో కీలకమైన ట్రెజరర్‌ పదవికి కూడా ఇరు వర్గాల నుంచి పోటీ పడే అభ్యర్థులు వీరేనని చెబుతున్నారు. అంజయ్య ప్యానల్‌ తరపున భరత్‌ మద్దినేని, నిరంజన్‌ ప్యానల్‌ తరపున శిరీష తూనుగుంట్ల పోటీ పడుతున్నట్లు సమాచారం. 

 

 

Tags :