ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్

ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్

హైదరాబాద్‌లో గుండె వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడంలో మంచిపేరును ఉషా ముళ్ళపూడి కార్డియాక్‌ సెంటర్‌ పేరు తెచ్చుకుంది. అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన డాక్టర్‌ వెంకటరత్నం మరణించిన తన కూతురు జ్ఞాపకంగా ఈ ఆసుపత్రిని స్థాపించి అతి తక్కువ ఖర్చుతో పేదలకు కూడా వైద్యాన్ని అందిస్తున్నారు. అలసి పోయిన గుప్పెడంత గుండెను ఆయన శస్త్ర నైపుణ్యంతో సేద తీరుస్తారు. మరణించిన కూతురు జ్ఞాపకాల నుంచి ఊపిరిపోసుకున్న ఉష ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌లో ధ్వనించే గుండెచప్పళ్లు తమ కూతురువేనంటారు. అందుకే ఆ హాస్పిటల్‌లోకి వచ్చిన హృద్రోగులను ఆయన అంత జాగ్రత్తగా చూసుకుంటారాయన. పదివేలకు పైగా గుండెలకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్‌ వెంకట రత్నం... తక్కువ ధరకు ఉన్నత స్థాయి వైద్యం అందించవచ్చని నిరూపించడమే తన లక్ష్యం అంటూ ముందుకెళుతున్నారు.

పశ్చిమ గోదావరిలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన వెంకటరత్నం క్రమక్రమంగా చదవుపై ఆసక్తి పెరగడంతో మెడిసిన్‌ వరకు ఇక్కడే చదివారు. తరువాత అమెరికాకు ఉన్నత చదువులకోసం వెళ్ళారు. అమెరికాలో బాగా సెటిలయినా మనసులో ఆంధ్రప్రదేశ్‌కు రావాలన్న కోరిక 1995లో కాకర్ల సుబ్బారావు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి నిమ్స్‌లో కార్డియాలజిస్ట్‌గా చేరారు. ఆ తర్వాత ఉష ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ రూపకల్పన చేశారు.. తన కూతురు ఉష దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం ఈ హాస్పిటల్‌ను ఆయన కట్టారు. గుండె జబ్బులకు సంబంధించి చౌకగా వైద్యం అందిస్తున్నామని ఆయన అంటారు.

Usha Mullapudi Cardiac Centre

Gajularamaram Road,
Qutubullapur Municipality,
Jeedimetla, Hyderabad - 500055

+(91)-40-23090610, 23090609

Tags :