ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ట్రై స్టేట్ తెలుగు సంఘం సంక్రాంతి-రిపబ్లిక్ డే సంబరాలు

ట్రై స్టేట్ తెలుగు సంఘం సంక్రాంతి-రిపబ్లిక్ డే సంబరాలు

చికాగోలోని ట్రై స్టేట్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జనవరి 16న సంక్రాంతి పండుగ సంబరాలు స్థానిక హిందు టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగోలో వైభవంగా జరిగాయి. సంక్రాంతి వాతావరణం కనిపించేలా కార్యక్రమ వేదికను పప్పు హేమంత్‌ రెడ్డి, మరువాడ ప్రసాద్‌, కర్రి భాస్కర్‌ రెడ్డి  తదితరులు అందంగా అలంకరించారు. వాసిరెడ్డి వరుణ్‌ ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  శ్రీమతి పరిటి రాజేశ్వరి,  శ్రీమతి శ్రీ విద్య గణేష్‌, శ్రీమతి వాసంతి నాయర్‌ల పర్యవేక్షణలో వారి శిష్యులు ప్రదర్శించిన సంగీతాత్మక శాస్త్రీయ గీతాలు ప్రేక్షకులను అలరించాయి. 

శ్రీమతి కాటమరెడ్డిస్నిగ్థ, శ్రీమతి దువ్వపు శ్రీలక్ష్మి నృత్య దర్శకత్వంలో చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి గీత నృత్యం ప్రేక్షకులలో దేశభక్తిని పెంపొందింజేసింది. శ్రీమతి తమ్మన శోభ నృత్య దర్శకత్వంలో కూచిపూడి నాట్య విహార్‌ విద్యార్థినులు శ్రీ భద్రాద్రి రామాలయ ప్రాశస్త్య నృత్యాన్ని చక్కగా ప్రదర్శించారు. శ్రీమతి జానకి నయ్యర్‌ నృత్య దర్శకత్వం లో ఆనంద్‌ డ్యాన్స్‌ అకాడమీ విద్యార్ధినిలు ఓం పరాశక్తి కూచిపూడి నృత్యాన్ని, మోహినీ యాట్టమ్‌ నృత్యాన్ని మరోరంజకంగా ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమం లో చిన్నారులు అయ్యలరాజు ఆనిక, పట్టిసపుశ్రేయ, బాలాంత్రపు రోషిణి, బాలాంత్రపు ఝుత్విక్‌ల దేశభక్తి గీతం ప్రేక్షకులను దేశ భక్తితో నింపితే, చిన్నారులు కలిగోట్ల సమన్విత పంచాగ్నుల శ్రీకీర్తి, బోమ్మిశెట్టి విష్ణు, ముసునూరు నికిత, నిశాలి ల గీతాలు ప్రేక్షకులను అలరిస్తే శ్రీమతి హరి మాధురి శ్రీమతి దేవరకొండ పద్మజల గీతాలు ప్రేక్షకులను రంజింప చేశాయి.

శ్రీమతి వంగర జ్యోతి, శ్రీమతి దండు మానస, శ్రీమతి కిలారు సుస్మిత, శ్రీమతి అయ్యలరాజు అపర్ణ ల నృత్య దర్శకత్వంలో చిన్నారులు చేసిన వైవిద్యమైన నృత్యాలు ప్రేక్షకులను ఉత్సాహభరితులను చేశాయి. శ్రీమతి తటపర్తి జయశ్రీ తమ దర్శకత్వం లో దాదాపు 20 మంది బాల బాలికలతో సమర్పించిన చెప్పింది చేస్తారా అనే ప్రభోదాత్మక హాస్య నాటిక అందరినీ నవ్వించింది. ఇంకా సత్యవోలు మారుతి చేసిన మిమిక్రీ ప్రేక్షకులను ఆకర్షిస్తే శ్రీ సత్యవోలు రామకృష్ణా రావు పాడిన పౌరాణిక  పద్యాలు పూర్వ రంగస్థల వైభవాన్ని గుర్తుకు తెచ్చాయి. చివరిగా శ్రీ అవసరాల రవి తమ బృందం తో సమర్పించిన వైవిద్య గీతాలు ప్రేక్షకులను రంజింప చేశాయి.

ముఖ్యంగా చిరంజీవి అవసరాల అఖిల తన అత్యంత గాన, వాద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడముతో పాటు ఇంకో చిరంజీవి ఓంకార్‌ గిటార్‌తో చేసిన వాద్య లయవిన్యాసం ప్రేక్షకుల నుండి ప్రత్యేక కరతాలధ్వనులను అందుకుంది. శ్రీమతి కలిగోట్ల ప్రణతి కార్యక్రమాన్ని ఆద్వంతం హాస్య పూర్వక సమయస్ఫూర్తి తో నిర్వహించడం తో బాటు చిన్నారులకు క్విజ్‌ నిర్వహించి ప్రేక్షకుల ప్రత్యేక ప్రశంసలు పొందారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమతి పూల స్వప్న, శ్రీమతి అయ్యలరాజు అపర్ణ, శ్రీమతి కలిగోట్ల ప్రణతి,  పప్పు హేమంత్‌ నిర్వహించిన భోగిపళ్ల కార్యక్రమం సంక్రాంతి  పండుగ ప్రత్యేకతను అందరికీ తెలియచెప్పింది వాసిరెడ్డి శ్రీనాథ్‌,  ఆచంట వీరస్వామి, మరువాడ ప్రసాద్‌, శ్రీమతి దువ్వూరి చాందిని ల నిర్వహణలో స్థానిక ప్రియా రెస్టారెంట్‌ వారు వచ్చిన అతిధులకు చక్కటి విందు భోజనం సమకూర్చారు. తమ్మన రవి, చిరంజీవి పప్పు అభినవ్‌లు రిజిస్ట్రేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించారు.  కొర్రపోలు రామకృష్ణ కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలను సమన్వయం చేయడమే కాకుండా ముగ్గుల  పోటీ, అందరూ ఉత్సుకతో ఎదురు చేసిన శామ్‌సంగ్‌ గెలాక్సీ టాబ్లెట్‌ కోసం డోర్‌ ప్రైజ్‌ పోటీ నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు.


Click here for Event Gallery

 

Tags :