ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టి.ఎ.స్.జె ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

టి.ఎ.స్.జె ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ (టి.ఎ.స్.జె) నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, ఇండియా కల్చరల్ సెంటర్, మార్ల్ టన్, సౌత్ జెర్సీ లో అంబరాన్నంటాయి.ఈ కార్యక్రమానికి సౌత్ జెర్సీలో ఉంటున్న ఆరు వందలకు పైగా తెలుగువారు హాజరయ్యి, సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మరియు భారత్ సంస్కితి సంస్థలు ముఖ్య దాతలుగా ఆర్థిక సహకారం అందించగా, సౌత్ జెర్సీలొ ఉన్నప్రవాస భారతీయ స్థానిక వ్యాపార సంస్థలు తమవంతు ఆర్థిక సహాకారాన్ని అందించి, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడ్డాయి.

కార్యక్రమం, ఉదయం 11.30 గంటలకు, టి.ఎ.స్.జె మహిళా సభ్యులు, దీప ప్రజ్యలనం చేసి ప్రారంబించారు. అనంతరం, సాయి జరుగుల టి.ఎ.స్.జె కార్యనిర్వాహక సభ్యుల తరపున మాట్లాడుతూ, సౌత్ జెర్సీలో ఉన్న తెలుగు వారందరు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ సంఘం గొడుగు కింద కుల, మత, వర్గ, ప్రాంతాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు వెలుతు, మన ముందు తరాలకు తెలుగు సంస్కృతి, సాంప్రదాయలను పరిచయం చేస్తూ, మన పిల్లలందరికి తెలుగు భాషను నేర్పిస్తూ, తోటి తెలుగు వారికి(అమెరికా మరియు భారతదేశంలో) చేయూత నందిస్తూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో, టి.ఎ.స్.జె కార్యనిర్వాహాక సబ్యులు, పిల్లలకు చిత్రలేఖన పోటీలను, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.అలాగే, అయిదు సంవత్సరాలలోపు పిల్లలకు, బోగి పండ్లు పోసుకొవడానికి వీలుగా ఒక చిన్న వేదికను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గం. వరకు సభ వేదికపై పిల్లలు, పెద్దలు రకరకాల సంగీత, నృత్య, నాటక కళా ప్రదర్శనలను ప్రదర్శించి, కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కనువిందు చేశారు.అనంతరం తెలుగు గాయని ఉష, గాయకుడు పృధ్వీ చంద్ర హుషారైన పాటలను పాడి కార్యక్రమానికి వచ్చిన అందరిని ఉర్రూతలూగించారు. పిల్లలు, పెద్దలు అందరు కలిసి సభావేదికపై మంత్ర ముగ్దులై తమదైన రీతిలో నృత్యంచేస్తూ సరదాగా గడిపారు. కార్యక్రమం ఆద్యంతం వేదిక కిక్కిరిసిన అతిథులతొ అట్టహాసంగా సాగింది.

’మోహన్ నన్నపనేని’(తానా పూర్వ అధ్యక్షులు) , రవి పొట్లూరి (సంయుక్త కార్యదర్శి), లక్ష్మి దేవినేని (సంయుక్త కార్యదర్శి) మరియు సతీష్ కొడావలి (భారత్ సంస్కృతి) కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి టి.ఎ.స్.జె కార్యనిర్వాహక సభ్యులను అభినందించారు. అలాగె, టి.ఎ.స్.జె భవిష్యత్ కార్యక్రమాలలొ వారి సహాయసహకారాలను అందిస్తామని హామి ఇచ్చారు.మోహన్ నన్నపనేని మట్లాడుతూ, సౌత్ జెర్సీలొ తెలుగు సంఘం ఏర్పాటు ఎంతొ సంతోషం కలిగించిందంటు, కార్యక్రమంలొ మన తెలుగు పిల్లలు ప్రదర్శించిన నృత్య రీతులుచాలా ఆనందాన్ని కలిగించాయని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయలను కాపాడుకోవడానికి, ఇలాంటి సంఘాల ఏర్పాటు ప్రతి ప్రాంతానికి అవసరమని చెప్పారు.అలాగె తానా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి అమెరికా తెలుగు సంఘం(ఆటా) వారు కూడావచ్చి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ కివారి అభినందనలు తెలియజేస్తూ, వారి సహాయసహకారాలు కూడా ఉంటాయని హామి ఇచ్చారు.

టి.ఎ.స్.జె నిర్వహించిన మొదటి కార్యక్రమానికి అనూహ్య స్పందన రావటం, అలాగే కార్యక్రమం అంతా ఒక కుటుంబ పండుగలా సాగిపోయింది. సంక్రాంతి సంబరాలకు వచ్చినతెలుగు వారికి కార్యనిర్వాహాక సభ్యులు చక్కటి తెలుగు వంటకాలను ఏర్పాటుచేశారు. అలాగె, కార్యక్రమానికి స్థానిక ప్రవాస భారతీయ సంస్థలు కూడా తమవంతు సహకారాన్ని అందించాయి.

చివరగా శ్రీనివాస్ కాశిమహంతి కార్యక్రమానికి ముగింపు పలుకుతూ కార్యనిర్వాహక సభ్యులు ’అంజలి నెరెడుమిల్లి, అనిల్ ఆటూరి, అరున గున్న, చక్రపాణి అల్లూరి, గంగ,  గట్టు చైతన్య వేనుగొపాల్, లక్ష్మి అద్దంకి, నిహారిక కాశిమహంతి, పవన్, ఫని వారణాసి, వెంకట్ మేడికొండ, ప్రశాంత్ బూసన్నగారి, ప్రవీన్ గుండా, రమా ముద్దన, రవిందర్ గాదె, సాయి జరుగుల,సంధ్య జె, సంతోష్ వడ్లమూడి, సతీశ్, శైల మండల, శిరీష వడ్లమూడి, శ్రీదేవి అరిగె, శ్రీనివాస్ నల్లమలపు, సుధాకర్, విశ్వ వారణాసి, యువరాజ్ జే, మరియు కార్యక్రమానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

 

Tags :