ASBL NSL Infratech

జై హ‌నుమాన్ లేటు త‌ప్పేలా లేదు

జై హ‌నుమాన్ లేటు త‌ప్పేలా లేదు

ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల‌ను దాటుకుని మ‌రీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన హ‌నుమాన్ కు సీక్వెల్ గా జై హ‌నుమాన్ సినిమాను ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను 2025లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పాడు. కానీ అదంత ఈజీగా వ‌చ్చేట్లు క‌నిపించ‌డం లేదు. దానికి చాలా కార‌ణాలున్నాయి.

అందులో మొద‌టిది జై హ‌నుమాన్ కు ఇంకా క్యాస్టింగ్ సెట్ కాలేదు. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ను భాగం చేయాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ ముందు నుంచి అనుకుంటున్నాడు. వారిని క‌లిసి క‌థ నెరేట్ చేసి, ఒప్పించి రెమ్యూన‌రేష‌న్స్ ఫైన‌ల్ అవ‌డానికి చాలానే టైమ్ ప‌ట్ట‌నుంది. ఇది కాకుండా ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం జై హ‌నుమాన్ ప‌నులు చూసుకుంటూనే మ‌రోవైపు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కీల‌క పాత్ర‌లో ఆక్టోప‌స్ అనే థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ స‌గానికి పైగానే పూర్త‌యింద‌ని స‌మాచారం. దీని త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో ర‌ణ్‌వీర్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే జై హ‌నుమాన్ కంటే ఈ సినిమానే ముందు సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. ఇది కాకుండా డీవీవీ దాన‌య్య కొడుకుని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తీసే అధీరాను తానే డైరెక్ట్ చేయాలా లేక వేరొక‌రికి ఆ బాధ్య‌త‌ల‌ను అప్పగించాలా అని చూస్తున్నాడ‌ట ప్ర‌శాంత్ వ‌ర్మ. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే జై హ‌నుమాన్ లేట్ అవ‌క త‌ప్ప‌దు. వీట‌న్నింటినీ లెక్క‌లోకి తీసుకుంటే జై హ‌నుమాన్ రావాలంటే 2026 లేదా మ‌రో సంవత్స‌రం లేట‌యినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :