ASBL NSL Infratech

ఎన్నికల ప్రచారానికి తెర... తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన మైక్లు

ఎన్నికల ప్రచారానికి తెర... తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన మైక్లు

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అత్యంత సమస్యత్మాక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల ప్రచారం నిలిపివేశారు. రాష్ట్రంలో మిగత 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు  90 ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెలంగాణలో 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో  సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.  ఓటింగ్‌ను నిర్దేశించిన సమయం ప్రకారమే శనివారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.  ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సహా అనేక మంది ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో  మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం కీలకంగా ఉంది. బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, సమావేశాలు, రోడ్‌షోలకు  అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు ఇంటింటికి తిరిగారు.దీంతో సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :